సినిమాలు ఆడనివ్వనన్న ఎమ్మెల్యే
పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. తెలంగాణ దిష్టి తమకు తగులుతోందంటూ ఈ మధ్యన నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. ఇప్పటికే బేషరతుగా తెలంగాణ ప్రాంతానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టు పట్టారు. లేక పోతే అడుగు పెట్టనిచ్చే ప్రసక్తి లేదన్నారు.
ఏపీపై అంత ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు ఉంటున్నారంటూ ప్రశ్నించారు. తక్షణమే ఆస్తులను అమ్మేసుకుని ఆంధ్రాకు వెళ్లి పోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఉండేదేమో ఇక్కడ పాట పాడేది మాత్రం ఆంధ్రా ప్రాంతం గురించి అంటే ఎలా ఒప్పుకుంటామని నిలదీశారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ స్పందించక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. స్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే సారీ చెప్పాలని లేక పోతే జడ్చర్ల నియోజకవర్గంలో తను నటించిన సినిమాలను ఆడనివ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు.






