ధ‌న‌వంతుల కోస‌మే ఆప‌రేష‌న్ ఖ‌గార్

Spread the love

కేంద్ర స‌ర్కార్ పై ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్

హైద‌రాబాద్ : కేవ‌లం బ‌డా బాబుల‌కు, ధ‌న‌వంతుల‌కు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోస‌మే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఖ‌గార్ చేప‌ట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భార‌త రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న‌ది హింస కాదా అని ప్ర‌శ్నించారు. మావోయిస్టులు వారి కోసం పోరాడ‌టం లేద‌ని, ఆదివాసీల హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌శ్నించ‌డం నేర‌మ‌ని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

బీజేపీ అభివృద్ధిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు, మీకు ఎదురు తిరిగిన వారు అందరూ నక్సలైట్స్ అవుతారా అని నిల‌దీశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను. కేవలం ఖనిజ వనరులను తవ్వుకొని ధనికులను మరింత ధనవంతులుగా మార్చేందుకు ఆపరేషన్ ఖగార్ మొదలు పెట్టారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇలాంటి ఆప‌రేష‌న్ల వ‌ల్ల ఉద్య‌మాలు, పోరాటాలు ఆగ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని కేంద్రం గుర్తిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

  • Related Posts

    వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

    Spread the love

    Spread the loveసీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మీటింగ్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై…

    ఎస్ఎస్ సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజ‌ల్ట్స్

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు విద్యా శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *