Sunday, 18 October 2026

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు

newsseals-KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించద‌ని స్ప‌ష్టం చేశారు.

లింగంపల్లి గ్రామంలో సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు కేటీఆర్. ఈ ఘటనలో ఉప్పుల మల్లయ్య మృతి చెందగా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తో పాటు మరో 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ లతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *