newsseals.com
News

కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్

VijayaBhaskar December 12, 2025
newsseals-APCM
Spread the love

విశాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారాలి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాల‌యాన్ని మంత్రి లోకేష్ తో క‌లిసి సీఎం ప్రారంభించారు.
ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేదన్నారు. క‌కానీ ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మారింద‌న్నారు . ఈ సంద‌ర్బంగా మంత్రి నారా లోకేష్ ప్ర‌సంగించారు. త‌మ‌ ముఖ్యమంత్రి ఓ జీపీఎస్, నిరంతరం అందరినీ అభివృద్ధి వెంట పరుగులు పెట్టిస్తార‌న్నారు.

రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పాం అన్నారు.ఇప్పుడు కాగ్నిజెంట్ కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తామ‌న్నారు. కాగ్నిజెంట్ లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు నారా లోకేష్‌. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను అభివృద్ధిబాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నార‌ని తెలిపారు.