కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు హామీ ఇచ్చారు.

ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేయాలంటే ముందుగా టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానం చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఈ స‌ద‌ర్బంగా సాయం చేసేందుకు వీలు కుదురుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం టీటీడీకి భారీ ఆదాయం స‌మ‌కూరుతున్నా, దేశ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఆల‌యాల‌ను నిర్మించే ప‌నిలో ఉంద‌న్నారు ఈ సంద‌ర్బంగా టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భార‌తీయ సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని చెప్పారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

  • Related Posts

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *