తిరుమ‌ల‌లో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ

Spread the love

17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.

ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. బిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారు. శ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్ర‌తి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారు. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేద్యాలుగా దోశ‌, బెల్లం దోశ‌, సుండ‌లు, సీరా, పొంగ‌ల్ వంటి ప్ర‌సాదాల‌ను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహా విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

  • Related Posts

    టీటీడీ స్థానికాల‌యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

    Spread the love

    Spread the loveధ‌నుర్మాసం సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యంతిరుప‌తి : టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. ఆరోజు మ‌ధ్యాహ్నం…

    100 ఎక‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్వ వృక్షాలు

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 100 ఎక‌రాల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య వృక్షాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *