డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు
చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగళవారం నుంచి వచ్చే జనవరి 15 వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు ధనుర్మాసము, జనవరి 3న ఆరుద్ర అభిషేకము, నటరాజస్వామి పుర వీధుల ఉత్సవం, రాత్రి ఆరికట్ల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట .4.00 గంటలకు ఆలయ మంగళ వాయిద్యములు , 4.15 గంటలకు గోపూజ, తిరుమంజనం , 4.30 గంటలకు పల్లియర పూజ (సుప్రభాతం లేదు) తేవారము ఉంది (తిరువైoబావై), 5.00 గంటలకు సర్వ దర్శనం, 5.00 గంటలకు మొదటి కాల అభిషేకం (సేవలు లేవు), 6.00 గంటలకు రెండవ కాల అభిషేకం, 7.00 గంటలకు పరివార నైవేద్యం ,7.30 గంటలకు గొబ్బెమ్మ వార్ల ఉత్సవం, 10.30 గంటలకు మూడవ కాల అభిషేకం (ఉచ్చికాలము) ఉంటుందని తెలిపింది.
సాయంత్రం 5.00 గంటలకు ప్రదోష కాలాభిషేకం , శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ నాలుగు రోజులలో రాత్రి 9.00 గంటలకు పల్లియర పూజ ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం ఈ మూడు రోజులలో రాత్రి 8:30 గంటలకు పల్లియర పూజ. 3న శనివారం ఆరుద్ర అభిషేకం,
ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట , 3.30 గంటలకు ఆలయ మంగళ వాయిద్యములు, 4.00 గంటలకు గోపూజ+ తిరుమంజనము, సుప్రభాతము (తిరువైoబావై) , 4.30 గంటలకు ప్రధమ కాల అభిషేకం, 5.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు సంకల్పం, 6.00 గంటలకు లింగోద్భవ కాల, పిష్టి లింగ అభిషేకము (స్వామి వారికి మాత్రమే) , 7.00 గంటలకు నటరాజ స్వామి వార్లకు అభిషేకం, 7.30 గంటలకు పరివార దేవతలకు నైవేద్యం , 9.00 గంటలకు శ్రీ నటరాజ స్వామి వార్ల గ్రామోత్సవం, 10.10 గంటలకు పురవీధులలో గొబ్బి ఉత్సవం , 10.30 గంటలకు ద్వితీయ కాల ఉష్ణోదక అభిషేకం, మధ్యాహ్నం 1.30 గంటలకు తృతీయ (మూడవ) కాల అభిషేకం, సాయంత్రము 5.00 గంటలకు ప్రదోషకాల అభిషేకం, రాత్రి 8 గంటలకు ఆరికట్ల ఉత్సవం , 9.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల పురవీధుల ఉత్సవం ఉంటుందని స్పష్టం చేశారు ఆలయ ఈవో.






