ప్రకటించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ : విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ అని అన్నారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు కూల్చివేత దారుణం అన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు, స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం అన్నారు జగన్ రెడ్డి.
విజయవాడ జోజినగర్ లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్ల నుంచి ఇళ్లు కట్టుకుని ఉంటే, ఒకేసారి వచ్చి ధ్వంసం చేశారని వాపోయారు. సుప్రీంకోర్టులో ఈ స్థలం గురించి న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. డిసెంబరు 31 వరకు, 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే, ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి, ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారని ఆరోపించారు.
ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, వారి ఆశీస్సులతోనే ఇదంతా జరిగిందన్నారు. అందుకే ఇంత అకస్మాత్తుగా. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసినా కూడా, అధికార దుర్వినియోగం చేస్తూ, వీరిని రోడ్డు పాల్జేశారని వాపోయారు.





