అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 4 (రెడ్ హిల్స్), రెడ్ హిల్స్ లో-లెవెల్ సెక్షన్ పరిధిలో సీతారాం బాగ్ ప్రాంతంలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా కాలనీ తొమ్మిది మంది ఇంటికో అధికార కనెక్షన్ ఉండగా.. అధికారుల అనుమ‌తులు లేకుండా వారే స్వంతంగా మొత్తం 15 అక్రమ న‌ల్లా కనెక్ష‌న్ తీసుకున్నారు.
ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం గుర్తించింది.

ఇదిలా ఉండ‌గా జ‌ల‌మండ‌లి ఎండీ సూచనలతో అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను తొల‌గించ‌డంతో పాటు అక్ర‌మ‌ క‌నెక్ష‌న్ తీసుకున్న తొమ్మిది మందిపై కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. త‌మ నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *