నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్
హైదరాబాద్ : ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన నటుడు శ్రీకాంత్ , హేమ కొడుకు రోషన్ మేక తో పాటు మలయాళ సూపర్ హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి ముఖ్య భూమిక పోషించిన చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. రోషన్ , అనస్వర రాజన్ సహజ సిద్దమైన నటన ఈ సినిమాకు హైలెట్ కాగా ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మరోసారి తనదైన స్వరాలు కూర్చి మెస్మరైజ్ చేశాడు. ప్రధానంగా తెలంగాణ కాసర్ల శ్యామ్ రాసిన గిర గిర గింగిరానివే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రధానంగా అనస్వర రాజన్ చేసిన డ్యాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
ఇక ట్రైలర్ కూడా పర్వాలేదని అనిపించేలా ఉంది. యాక్షన్-హీరో ఇమేజ్ కోసం రోషన్ మేక సాహసం చేస్తున్నాడు. తన నుంచి ఇది రెండో మూవీ కావడం విశేషం. చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమాకు గతంలో నటించిన మూవీకి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. క్రిస్మస్ 2025న థియేటర్లలో విడుదల కానున్న ‘ఛాంపియన్’ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు దర్శకుడు, నిర్మాతతో పాటు హీరో కూడా. భారత స్వాతంత్ర్య ప్రారంభ రోజుల్లో, మతోన్మాద నిజాం పాలన రజాకార్ల సైన్యం సహాయంతో హిందువులను భయ భ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించింది. .
అనస్వర రాజన్ సహనటిగా నటించిన ‘ఛాంపియన్’ చిత్రానికి పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా ఈ చిత్రం కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.







