టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

Spread the love

కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ క‌మిటీ చైర్మ‌న్

ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా వ‌చ్చే ఏడాది 2026లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. శ‌నివారం ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. గ‌త కొంత కాలంగా పూర్ ఫ‌ర్మారెన్స్ బాగా లేద‌ని అందుకే ఎంపిక చేయ‌లేద‌ని చెప్పాడు. త‌న వైస్ కెప్ట‌న్ స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించాడు. గ‌త కొంత కాలంగా త‌ను 31 టి20 మ్యాచ్ లు ఆడాడు. 291 ర‌న్స్ మాత్ర‌మే చేశాడ‌ని, అందుకే సరైన ఓపెనింగ్ జోడీకి సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు దూరంగా పెట్టిన రింకూ , కిష‌న్ ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఇదే క్ర‌మంలో జితేష్ శ‌ర్మ స్థానంలో కిష‌న్ ప‌నికి వ‌స్తాడ‌ని రెండో వికెట్ కీప‌ర్ గా ప‌నికి వ‌స్తాడ‌ని ఎంపిక చేశామ‌న్నాడు అజిత్ అగార్క‌ర్. ఇక రింకూను ఫినిష‌ర్ గా ఉంటాడ‌ని తీసుకున్నామ‌న్నాడు. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

  • Related Posts

    అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    Spread the love

    Spread the loveసీఎస్కే జ‌ట్టులో చేరిన కేర‌ళ క్రికెట‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టాప్ లో నిలిచాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు త‌న…

    సంజు సామ్సన్ నాకు ప్రేర‌ణ : జితేష్ శ‌ర్మ‌

    Spread the love

    Spread the loveత‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వం అద్బుతం ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఇప్పుడు ఈ ఏడాది జ‌రిగే ఐపీఎల్ టోర్నీపై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు. ప్ర‌త్రి క్రికెట‌ర్ కు ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *