రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మంగళవారం సహచర మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్ తో కలిసి శ్రీవారిని దర్శించు కోవడం మరిచి పోలేని అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. ఈ సందర్బంగా పూజారుల ఆశీర్వచనాలు అందుకోవడం, చిత్ర పటం, ప్రసాదాలను తీసుకోవడం సంతోషం కలిగించిందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆ దేవ దేవుడు కలియుగ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏపీపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. గత ప్రభుత్వం తిరుమల పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ దేవుడు వారిని 11 సీట్లకే పరిమితం చేశాడని అన్నారు. అయినా వారికి బుద్ది రాలేదన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 30 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిందన్నారు వంగలపూడి అనిత.





