మ‌రిన్ని ఎగ్జిబిష‌న్స్ ను నిర్వ‌హించాలి

స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిష‌న్ల‌ను నిర్వహించాల్సిన అవస‌రం ఉంద‌న్నారు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఆభరణాల ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల కళా నైపుణ్యాన్ని ఒకే వేదికపై ప్రజలకు చేరువ చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఇలాంటి ఎగ్జిబిషన్లు వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతమివ్వడంతో పాటు, స్థానిక వ్యాపారాలు , ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహద పడతాయని అభిప్రాయ ప‌డ్డారు కందుల దుర్గేష్. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిభ క‌లిగిన క‌ళా నైపుణ్యం క‌లిగిన వారు ఉన్నార‌ని చెప్పారు. త‌మ కూట‌మి స‌ర్కార్ పెద్ద ఎత్తున వారికి స‌హ‌కారం అందించేందుకు కృషి చేస్తుంద‌ని అన్నారు. ఆప్కో ఆధ్వ‌ర్యంలో భారీ డిస్కౌంట్ తో చేనేత అమ్మ‌కాల‌ను కూడా ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఆవ‌కాయ్ ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర స‌ర్కార్ రూ. 5 కోట్లు మంజూరు చేసింద‌న్నారు. క‌వులు, కళాకారులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటార‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *