త‌ళుక్కుమ‌న్న మాళ‌విక మోహ‌న్

Spread the love

రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

హైద‌రాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్ర‌భాస్. త‌న‌తో పాటు రిధి, మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ ఇందులో కీ రోల్ పోషించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు. మారుతి చాన్నాళ్ల పాటు రిస్క్ తీసుకుని రాజా సాబ్ ను తీశాడు. ఇప్ప‌టికే మూవీ పూర్త‌యింది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్, సాంగ్స్ , గ్లింప్స్ విడుద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి గ్రౌండ్ లో గ్రాండ్ గా జ‌రిగింది. భారీ ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు ఛాన్స్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు సినీ న‌టులు.

మ‌రో వైపు రాజా సాబ్ సినిమా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని, త‌న సినీ కెరీర్ లో గ‌తంలో న‌టించిన పాత్ర‌ల‌కంటే భిన్నంగా ఇందులో న‌టించార‌ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు మారుతి. ఇదే స‌మ‌యంలో వేదిక పై నుంచే మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఖాఃన్ని ఆపుకోలేక పోయాడు. చివ‌ర‌కు న‌టుడు ప్ర‌భాస్ స్టేజి పైకి రావాల్సి వ‌చ్చింది. త‌నను మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్, ప్ర‌భాస్ ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో ఈ సినిమాలో పూర్తిగా రొమాంటిక్ పాత్ర పోషించాడ‌ని చెప్పాడు ద‌ర్శ‌కుడు. అంతే కాదు ఇందులో ప్ర‌భాస్ పాత్ర స‌రిగా లేద‌ని అనుకుంటే త‌న ఇంటికి రావాల‌ని ప్ర‌క‌టించాడు. ఇదే క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు ల‌వ్లీ బ్యూటీ మాళ‌విక మోహ‌న్.

  • Related Posts

    మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

    Spread the love

    Spread the loveనియ‌మించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైద‌రాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్…

    దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    Spread the love

    Spread the loveఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *