తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌పై ఏఈవో త‌నిఖీలు

జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ఎస్ఎస్డీ టోకెన్లు ర‌ద్దు

తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. ఈ త‌నిఖీల్లో అద‌న‌పు ఈవో వెంట శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, అన్న ప్ర‌సాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర‌, హెల్త్ డిప్యూటీ ఈవో సోమ‌న్నారాయ‌ణ‌, ఈఈ శ్రీ‌నివాసులు, డిఈ చంద్ర‌శేఖ‌ర్‌, ఐటీ డిప్యూటీ జీఎం వెంక‌టేశ్వ‌ర్లు నాయుడు, అశ్వ‌ని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్‌ వెంక‌ట సుబ్బారెడ్డి, ప‌లువురు విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా ఏఈవో మీడియాతో మాట్లాడారు. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌తి రోజూ జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని స‌హ‌క‌రించాల‌ని భ‌క్తులను కోరారు.

ఈ సంద‌ర్బంగా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు ఏఈవో. ఈనెల 30వ తేదీ నుండి వ‌చ్చే జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు ఉంటాయ‌న్నారు. తొలి మూడు రోజులు డిసెంబర్ 30, 31 , జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇత‌ర భ‌క్తుల‌కు ఎలాంటి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని అన్నారు. కాగా టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *