అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు
అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150 మిలియన్ల కు పైగా ప్రపంచ కప్ టిక్కెట్లు కావాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రకటించారు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా నుండి అభిమానులు అత్యధిక సంఖ్యలో టిక్కెట్ల కోసం అభ్యర్థనలు పంపారని చెప్పారు. ఆ తర్వాత జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోయే ప్రపంచ కప్ టిక్కెట్ల ధరలను సమర్థించారు. వాటికి ఉన్న భారీ డిమాండ్, ప్రపంచ వ్యాప్తంగా క్రీడకు లభించే ఆదాయాన్ని ఆయన ఉదహరించారు.
ఈ నెలలో అభిమానుల బృందాలు టిక్కెట్ల ధరలపై భగ్గుమన్నాయి. గతంలో 2022 లో నిర్వహించిన ఫిఫా టోర్నమెంట్‌లోని ఇలాంటి మ్యాచ్‌ల టిక్కెట్ల కంటే చాలా రెట్లు ఎక్కువ ధర ఉన్నాయంటూ వాపోయారు. అర్హత సాధించిన జట్ల అభిమానులకు మ్యాచ్‌లను మరింత సరసమైనవిగా చేయడానికి ఫిఫా $60 టిక్కెట్ శ్రేణిని ప్రవేశపెట్టిందన్నారు. తమ వద్ద ఆరు-ఏడు మిలియన్ల టిక్కెట్లు అమ్మకానికి ఉన్నాయి. ఇదిలా ఉండగా 15 రోజుల్లో మాకు 150 మిలియన్ల టిక్కెట్ల అభ్యర్థనలు వచ్చాయన్నారు. కాగా ప్రతి రోజూ 10 మిలియన్ల టికెట్లు కావాలంటూ కోరుతున్నారని తెలిపారు . ఇన్సాంటినో దుబాయ్ లో జరిగిన ప్రపంచ క్రీడా సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ కప్ దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో, ఫిఫా మొత్తం 44 మిలియన్ల టిక్కెట్లను విక్రయించిందని ప్రకటించారు. ఇది ఓ రికార్డు అని వెల్లడించారు.








