టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆసిస్ జ‌ట్టు ఎంపిక

గాయం నుంచి కోలుకున్న క‌మిన్స్, వుడ్, డేవిడ్

ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌నున్న త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. గ‌త కొంత కాలంగా గాయాల కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా ఉన్న స్టార్ క్రికెట‌ర్లు పాట్ క‌మిన్స్, జోష్ హేజిల్ వుడ్ , డేవిడ్ ల‌ను తిరిగి వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులోకి చేర్చుకుంది. ప్ర‌స్తుతం అందిన స‌మాచారం మేర‌కు ఈ ముగ్గురు కీల‌క ఆట‌గాళ్లు పూర్తిగా ఫిట్ నెస్ తో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ టోర్నీలో శ్రీలంకలో తమ గ్రూప్ మ్యాచ్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 11న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది వ‌ర‌ల్డ్ క‌ప్ .

ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా బోర్డు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో స‌మంగా ఉండేలా చూశామ‌ని తెలిపింది. ఇక జ‌ట్టు ప‌రంగా ఇలా ఉంది. మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఆడ‌నున్నారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *