అమెరికాకు పెరుగుతున్న పెట్టుబ‌డులు

ఆశాభావం వ్య‌క్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా : నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశీయ ఉత్పత్తులపై సుంకాలు లేక పోవడంతో అమెరికా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అమెరికా అంతటా కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో కర్మాగారాలు, వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నాయని ఆయన అన్నారు. 2026 సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా త‌న స్పంద‌న‌ను తెలిపారు. దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులు ఎటువంటి సుంకాలను ఎదుర్కోక పోవడంతో కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో అమెరికా అంతటా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు కానున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోష‌ల్ సామాజిక వేదికగా స్పందించారు. భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉత్ప‌త్తులు త‌యారు చేయాల‌ని సూచించారు. ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడంపై అమెరికా ప్రపంచ రికార్డును నెలకొల్పిందని పేర్కొన్నారు. త‌మ దేశం నెంబ‌ర్ వ‌న్ గా ఉంద‌ని, డ్రాగ‌న్ చైనాను తాము అధిగ‌మించ‌డం నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా సంతోషంగా ఉంద‌న్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక రెండవ స్థానంలో ఉన్న చైనా కంటే ట్రిలియన్ల డాలర్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఇది సుంకాలు , మీరు మీ ఉత్పత్తిని అమెరికాలో తయారు చేస్తే బాగుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాము తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌నే దేశ వ్యాప్తంగా క‌ర్మాగారాలు, వ్యాపారాలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *