రవితేజ, ఆషిక ఆర్, డింపుల్ కీ రోల్స్
వరంగల్ జిల్లా : టాలీవుడ్ లో ప్రస్తుతం తెలంగాణ జానపదాలు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులోకి ఇదే ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరిలియో చేరి పోయాడు. తను అందించిన సంగీతానికి జనం ఫిదా అవుతున్నారు. ధమాకాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం, మన శివ శంకర్ ప్రసాద్ గారు సినిమాల పాటలు జనాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కీ రోల్ పోషించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం. దీనికి కూడా భీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు దుమ్ము రేపుతున్నాయి. ఇందులో రవితేజతో పాటు అందాల ముద్దుగుమ్మలు ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. వరంగల్ జిల్లా వేదికగా సినిమాకు సంబంధించిన వామ్మో వాయ్యో సాంగ్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో టాప్ లో కొనసాగుతోంది. దీనికి దర్శకత్వం వహించారు కిషోర్ తిరుమల. వామ్మో వాయ్యో పాటను దేవ్ పవర్ రాశారు. యుకెలో ఉంటున్న స్వాతి రెడ్డి అద్బుతంగా పాడింది. ఇప్పుడు ఆమె పాడిన పాట ఊహించని రీతిలో టాప్ లో కొనసాగుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని నిర్మించారు సుధాకర్ చెరుకూరి. ఇదిలా ఉండగా వరంగల్ లోని ఓ కాలేజీలో నటీ నటులు సందడి చేశారు. విద్యార్థులలో జోష్ నింపారు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి. అంతే కాదు ఎవరూ ఊహించని రీతిలో సర్ ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు తిరుమల. తను కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు.







