క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు పిలుపు

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో అత్యంత విలువైన‌ది బాల్యం అన్నారు. విద్య‌ను నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని సూచించారు.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ నాయుడు. ఈ సంద‌ర్బంగా డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌సంగించారు. ఆక‌లి అనేది లేకుండా అన్న ప్ర‌సాదం అంద‌జేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు బీఆర్ నాయుడు. ఈ పథకం ద్వారా 436 మంది విద్యార్థినులకు లబ్ది చేకూరనుందని చెప్పారు.

ఇంటర్మీడియట్ దశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి విద్యార్థిని లక్ష్యంతో, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం 97% ఫలితాలు సాధించిన కళాశాల ఈసారి 100% ఫలితాలతో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు బీఆర్ నాయుడు. జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జి. భానుప్రకాష్ రెడ్డి, ఎస్. శాంతారామ్, నరేష్ కుమార్, డీఈవో డా. టి. వేంకట సునీలు, కళాశాల అధ్యాపకులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *