హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు

Spread the love

వెల్ల‌డించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్ రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అనంతరం ఐసియూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారు. కడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తం, చెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగా, ఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తం, చెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఈ టి వి సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్, వైద్యులు, తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్ల‌డించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్ రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అనంతరం ఐసియూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారు. కడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తం, చెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగా, ఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తం, చెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సీఈ టి వి సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్, వైద్యులు, తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 44 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    Spread the love

    Spread the love33 లక్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల సంద‌ర్బంగా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న ఈవో అనిల్…

    శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం కోసం విస్తృత ఏర్పాట్లు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన జిల్లా కలెక్ట‌ర్ రాజ‌కుమారి శ్రీ‌శైలం : శ్రీ‌శైలంలోని మల్ల‌న్న ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు నంద్యాల జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌కుమారి గునియా. శ్రీశైంలో ఆమె స‌మీక్ష చేపట్టారు ఏర్పాట్ల‌పై.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *