రోడ్డు భ‌ద్ర‌త మ‌నంద‌రి భాద్య‌త

VijayaBhaskar · January 25, 2026
Spread the love

క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్పతి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : రోడ్డు భ‌ద్ర‌త‌పై సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారు క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ఫ‌తి. ఆమె వెరీ స్పెష‌ల్. పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎవ‌రికీ లొంగ‌కుండా త‌ను అస‌లైన‌, సిస‌లైన ప్ర‌జా అధికారిణిగా గుర్తింపు పొందారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న కాలాన్ని వినియోగిస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్లు వ‌చ్చినా డోంట్ కేర్ అంటున్నారు. నిత్యం జిల్లాలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం అంద‌రికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. తాజాగా రోడ్ సేఫ్టీ పై ప్ర‌ధానంగా దృష్టి సారించారు. ఇదే క్ర‌మంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా సీపీ గౌస్ ఆలంతో క‌లిసి రోడ్డుపై బైక్ పై ప్ర‌యాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైర‌ల్ గా మారాయి.

మోటార్ సైకిల్ పై కలిసి ప్రయాణించడం ద్వారా ‘Arrive-Alive’ కార్యక్రమంలో సంయుక్తంగా పాల్గొన్నారు జిల్లా క‌లెక్ట‌ర్ , సీపీలు. బైక్ పై వారి ఉనికి రోడ్డు భద్రత పట్ల బలమైన నిబద్ధతను సూచిస్తుంది . స్థానం లేదా అధికారంతో సంబంధం లేకుండా ట్రాఫిక్ క్రమశిక్షణ అందరికీ వర్తిస్తుందని తెలియజేసింది.
బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం అనే లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ‘Arrive-Alive’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హెల్మెట్ వాడకం ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలను పాటించడం , సురక్షితమైన రైడింగ్ పద్ధతులపై శక్తివంతమైన ప్రజా సందేశాన్ని పంపింది.