సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వాలి : ర‌హానే

Spread the love

ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడ‌ని కామెంట్

ముంబై : కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్ అజింక్యా ర‌హానే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ప్ర‌స్తుతం ఇండియాలో జ‌రుగుతున్న న్యూజిలాండ్ టి20 సీరీస్ లో ఘోరంగా విఫ‌లం అయ్యాడు. మూడు మ్యాచ్ ల‌లో శాంస‌న్ 10, 6, 0 కే ప‌రిమితం అయ్యాడు. దీంతో త‌న‌ను మారుస్తార‌ని, ఇక త‌న కెరీర్ ముగిసిన‌ట్టేన‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించాడు. మంగ‌ళ‌వారం ర‌హానే మీడియాతో మాట్లాడాడు. త‌ను పూర్తిగా సంజూ శాంస‌న్ కు మ‌ద్ద‌తు ప‌లికాడు. జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తో పాటు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ పేల‌వ ఫామ్ లో ఉన్న స‌మ‌యంలో శాంస‌న్ కు బేష‌ర‌తుగా మద్ద‌తు ఇవ్వాల‌ని సూచించాడు ర‌హానే.

జట్టు యాజమాన్యం, కెప్టెన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని నేను భావిస్తున్నాన‌ని పేర్కొన్నాడు. మీరు ఈ మ్యాచ్‌లన్నీ ఆడబోతున్నారు, అలాగే ప్రపంచ కప్‌లో కూడా ఆడతారు అని సంజు శాంసన్‌కు చెప్పాల‌ని భ‌రోసా ఇవ్వాల‌న్నారు మాజీ కెప్టెన్. ఇదే స‌మ‌యంలో మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కూడా స్పందించాడు. సంజూ శాంసన్‌ను జట్టు నుండి తొలగించడం గురించి ఆలోచించడానికి ఇది చాలా తొందరపాటు అని పేర్కొన్నాడు. గతంలో బాగా ఆడినప్పుడు సంజూను ఆడించి, ఇప్పుడు ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడని అతన్ని ఆడించడం వంటి ఇలాంటి సర్కస్ విన్యాసాలు భారత్ కొనసాగిస్తే, దాని పర్యవసానం భారత్‌కు ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు.

  • Related Posts

    సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

    Spread the love

    Spread the loveబీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం…

    ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *