మ‌రోసారి నిరాశ ప‌రిచిన సంజూ శాంస‌న్

ఇక కెరీర్ ముగిసిన‌ట్టేనా స్టార్ క్రికెట‌ర్

హైద‌రాబాద్ : నిన్న‌టి దాకా ప‌రుగుల వ‌ర‌ద పారించి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీకి స‌వాల్ గా మారిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు ఇప్పుడు ఏమైంద‌ని ఫ్యాన్స్ , క్రికెట్ అనలిస్టులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏరికోరి త‌న‌కు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఛాన్స్ ఇచ్చారు. వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుకు కూడా ఎంపిక చేశారు. అయినా అందివ‌చ్చిన అరుదైన అవ‌కాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు శాంస‌న్. అత్యంత చెత్త షాట్స్ ఆడుతూ త‌న కెరీర్ ను తానే నాశ‌నం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ జ‌ట్టు భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్బంగా 5 టి20 మ్యాచ్ లు ఆడ‌నుంది.

త‌నను మూడు మ్యాచ్ ల‌లో ఆడించాడు గంభీర్. త‌ను తొలి మ్యాచ్ లో 10 ర‌న్స్ చేస్తే , 2వ మ్యాచ్ లో కేవ‌లం 6 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యాడు. తీరా మూడో మ్యాచ్ లోనైనా స‌త్తా చాటుతాడ‌ని అనుకుంటే ఏకంగా డ‌కౌట్ అయి వెనుదిరిగాడు. చివ‌ర‌కు త‌న కెరీర్ కు తానే పుల్ స్టాప్ పెట్టుకున్నాడు. ఇప్ప‌టికే త‌న ఓపెనింగ్ కు రాగా ఇదే క్ర‌మంలో ఎంతో మంది స్టార్ ప్లేయ‌ర్లు నిరీక్షిస్తున్నారు ఆడేందుకు . ఇక నాలుగో మ్యాచ్ లో త‌ను ఉంటాడో లేదో తెలియ‌దు. ఇక త‌మ‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు తాను ఏం చెబుతాడనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అద్బుత‌మైన ఆట‌గాడి ఆట ఇక కేవ‌లం ఐపీఎల్ లో మాత్ర‌మే చూడ‌గ‌ల‌మా అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *