చిత్తూరు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. వివిధ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తారు. కంగుంది పర్యాట‌క‌ ప్రాంతంగా అభివృద్ధి పనులలో సీఎం పాల్గొంటార‌ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేయాల‌ని ఎమ్మెల్సీ శ్రీ‌కాంత్ కోరారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం కడ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడితో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి రోజున అధికారికంగా ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలు సంబంధించి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈనెల చివరి తేదీలలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు వివిధ శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం పాల్గొంటారని తెలిపారు. సామాజిక భద్రతా పెన్షన్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సంబంధించిన శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామ‌న్నారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తారని తెలిపారు క‌లెక్ట‌ర్.హెచ్ ఎన్ ఎస్ ఎస్ అధికారులు, డాక్యుమెంట్ రూపంలో నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు, డిఎంహెచ్ ఆధ్వర్యంలో సంజీవని ప్రాజెక్ట్, ప్రాంతీయ వైద్య శాలల సంబంధించిన సమగ్ర రిపోర్టును సిద్ధం గా ఉంచాల‌న్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏదో ఒక గ్రామంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులతో ముచ్చటిస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి బహిరంగ సభ, వివిధ ఆస్తుల పనిముట్లు పంపిణీ, మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పలు పారిశ్రామివేత్తలతో ఒప్పందాలు, స్వయం మహిళ సంఘాల ప్రతినిధులకు 500 మంది రుణాలు పంపిణీ చేస్తార‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *