కాచవాణి సింగారంలో ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణపై చ‌ర్య‌లు

కిలోమీటర్ పొడవున్న ప్రహరీని తొలగించిన హైడ్రా
హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తున్నాడు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌మండ‌లం కాచ‌వాణి సింగారంలో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ను హైడ్రా తొల‌గించింది. 40 ఫీట్ల ర‌హ‌దారిలోకి 13 అడుగుల మేర జ‌రిగి ప‌క్క‌నే ఉన్న త‌న పొలం హ‌ద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీట‌రు మేర ప్ర‌హ‌రీ నిర్మించ‌గా.. దివ్యాన‌గ‌ర్ సింగ‌రేనియ‌న్స్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు మేర‌కు హైడ్రా ఈ చ‌ర్య‌లు తీసుకుంది. నారాపల్లి – దివ్యనగర్ – కాచ‌వాణి సింగారం గ్రామాలను కలుపుతూ సాగే ఈ ర‌హ‌దారిని ఆక్ర‌మించారంటూ ఫిర్యాదు చేశారు.

దీంతో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో సంబంధిత అధికారుల‌తో ప‌రిశీలించింది. దివ్యాన‌గ‌ర్ ఫేజ్ 5 పేరిట నాలుగు లే ఔట్లు వేసిన‌ప్పుడు 40 ఫీట్ల వెడ‌ల్పుతో ర‌హ‌దారిని కేటాయించారు. త‌ర్వాత ఆ ప‌క్క‌నే వ్య‌వ‌సాయ‌భూమి ఉన్న మ‌లిపెద్ది హ‌నుమంత రెడ్డి త‌న భూమి ఉంద‌ని పేర్కొంటూ 13 అడుగుల మేర‌కు రోడ్డులోకి జ‌రిగి ప్ర‌హ‌రీ నిర్మించారు. లే ఔట్‌లోని వెయ్యికి పైగా ఉన్న ప్లాట్ల య‌జ‌మానుల‌కు.. హ‌నుమంత రెడ్డికి మ‌ధ్య ద‌శాబ్ద కాలంగా ఈ స‌మ‌స్య న‌లుగుతోంది. ఇదే విష‌యాన్ని సొసైటీ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో పిర్యాదు చేశారు. లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారిని ప‌రిశీలించి ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది. దీంతో రహదారి పూర్తి వెడల్పుతో తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రజా రహదారుల పరిరక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *