బిజీగా ఉన్నా సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేను : కేసీఆర్

మున్సిప‌ల్ ఎన్నిక‌ల జాబితాలో బిజీగా ఉన్నా

హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేర‌కు ఆయ‌న స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌తి ఒక్క‌రు చేసే ప‌ని ఇద‌ని, ఇది ప్రాసెస్ లో భాగంగా జ‌రిగేదేన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే విచార‌ణ‌కు తాను హాజ‌రు కాలేనంటూ బాంబు పేల్చారు కేసీఆర్. నిన్న‌నే నోటీసులు ఇచ్చి ఇవాళే రావాలంటే కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు మాజీ సీఎం. తాను ప్ర‌స్తుతం ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నాన‌ని తెలిపారు.

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింద‌ని, ఇందులో భాగంగా త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థుల జాబితాను ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నాన‌ని, అందుకే తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేనంటూ సిట్ కు స్ప‌ష్టం చేశారు. పుర‌పాలిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈనెల 30వ తేదీ వ‌ర‌కే లాస్ట్ డేట్ కావ‌డంతో ఇంకాస్తా స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఇవాళ కాకుండా ఇంకో తేదీని సూచించాల‌ని అన్నారు కేసీఆర్. అయితే సిట్ ఇంఛార్జ్ కు బిగ్ షాక్ ఇచ్చారు మాజీ సీఎం. తాను ఎక్క‌డ ఉంటున్నాన‌నో అదే త‌న శాశ్వ‌త చిరునామా అని , కాబ‌ట్టి తాను ఉంటున్న ఎర్ర‌వ‌ల్లి లోని త‌న నివాసంలోనే విచారించాల‌ని సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *