త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారిన విజ‌య్

ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌

చెన్నై : త‌మిళ సినీ రంగ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తింపు పొందాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. సూప‌ర్ స్టార్ అంటేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది త‌లైవా ర‌జ‌నీకాంత్. ఆయ‌న‌తో స‌రి స‌మానంగా అభిమానుల‌ను సంపాదించుకున్న ఏకైక న‌టుడు విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌న సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కోట్లాది మంది అభిమానుల‌ను విస్తు పోయేలా చేశాడు. తన అస‌లు పేరు జోసెఫ్ . త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్. క్రిష్టియ‌న్ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తి. త‌న‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు త‌మిళ‌నాడును షేక్ చేస్తోంది. గ‌తంలో ప‌లువురు సినీ రంగానికి చెందిన వారు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. కొంద‌రు మాత్ర‌మే స‌క్సెస్ అయ్యారు. ఎంజీ రామ‌చంద్ర‌న్, జ‌య‌ల‌లిత ముందుగా గుర్తుకు వ‌స్తారు. ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్, విజ‌య‌కాంత్ , ర‌జ‌నీకాంత్ ట్రై చేశారు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఇక తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను సినిమాల‌కు పుల్ స్టాప్ పెడుతున్నాన‌ని పార్టీ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల రణ‌రంగంలోకి రెడీ అయ్యాడు. ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని ప్రారంభించాడు. ప్ర‌స్తుతం త‌న ఆఖ‌రి చిత్రం జ‌న నాయ‌గ‌న్ వివాదాల మ‌ధ్య ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేదు. ఈ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సి ఉంది. ఓ వైపు బీజేపీ ఇంకో వైపు రాష్ట్రంలో డీఎంకే త‌న‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తోంద‌ని త‌న అభిమానులు, పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ త‌రుణంలో జాతీయ ఛాన‌ళ్లు టీవీకే విజ‌య్ తో చిట్ చాట్ చేసేందుకు క్యూ క‌డుతున్నాయి. తాజాగా ఎన్డీటీవీ విజ‌య్ ను క‌లిసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *