Friday, 16 October 2026

రేపే శ్రీ కోదండ‌రామ‌స్వామి పేట ఉత్సవం

newsseals-PetaUtsavam

కూపుచంద్ర‌పేట గ్రామానికి ఊరేగింపు

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన సోమ‌వారం కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *