newsseals.com
News

బోగస్ కంపెనీలతో ఒప్పందం స‌ర్కార్ మోసం

VijayaBhaskar February 3, 2026
newsseals-MLCKavitha
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. క‌విత మీడియాతో మాట్లాడారు. బోగ‌స్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇదేనా ప్ర‌జా పాల‌న అని నిల‌దీశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. విశ్వసనీయత లేని, ప్రజలకు తక్కువ సమాచారం అందుబాటులో ఉన్న, తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థలతో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటనలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

420 హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ ఇప్పుడు జ‌నాల‌కు ఏం స‌మాధానం చెబుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన 2 ల‌క్ష‌ల జాబ్స్ సంగ‌తి ఏంటి అంటూ ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ప్ర‌జ‌లు మౌనంగా ఉన్నార‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టేన‌ని పేర్కొన్నారు. ఇక‌నైనా ఒప్పందాలు చేసుకుంటే ప్ర‌జ‌ల‌కు సంబంధించిన డొమైన్ లో పొందు ప‌ర్చాల‌ని స్ప‌ష్టం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.