పార్లమెంట్ లో తొలి ప్రసంగంతో సంచలనం
న్యూఢిల్లీ : ఇళయ నాయగన్ , దిగ్గజ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మహాకవి శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానంలోని కవితలోని కొన్ని ఫంక్తులను వినిపించారు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా ఉండదని స్పష్టం చేశారు కమల్ హాసన్. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని అన్నారు పార్లమెంట్ సాక్షిగా. ఈ ఎంఎన్ఎం అధ్యక్షుడు సమాఖ్య వాదం, సంస్కృతి, రాజ్యాంగ విలువలను సమర్థించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.
తమిళనాడుకు చెందిన కమల్ హాసన్ సినిమా నుండి పార్లమెంట్ వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా రాజకీయ పరంగా ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు. వివిధ రంగాల ప్రజలు ఈ సభలోకి ప్రవేశించడానికి చాలా తలుపులు తెరుచుకుంటాయని అన్నారు. అయితే ఇందులోకి ప్రవేశించేందుకు తనకు సినిమా ఓ మార్గం చూపించేలా చేసిందన్నారు కమల్ హాసన్. సినిమాలు తనను తమిళ చరిత్రకు ఎలా పరిచయం చేశాయో తెలిపారు.





