newsseals.com
News

భూగ‌ర్భ జ‌లాల‌పై దృష్టి సారించాలి : సీఎం

VijayaBhaskar February 6, 2026
neewsseals-APCM
Spread the love

నీటి వినియోగ‌దారుల సంఘాల స‌మావేశంలో

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది వేస‌వి కాలం అని భూగ‌ర్భ జ‌లాలు త‌గ్గిపోయే అవ‌కావశం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి నీటి వినియోగంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు.
సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఏమేరకు ఉన్నాయి, భూగర్భజలాల రీఛార్జి స్ట్రక్చర్ల నిర్మాణం తదితర అంశాల‌పై ఫోక‌స్ పెట్టాల‌న్నారు సీఎం.

ప్రదర్శన వద్ద వ్యవయసాయానికి ఉపయోగపడే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్ల సాంకేతికతను ప‌రిశీలించారు. వీటి వినియోగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్ప‌టికే కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక సాగు, తాగు నీటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే రూ. 8,000 కోట్లు కేవ‌లం ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు మంజూరు చేశామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. రైతుల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు సీఎం.