ప్రకటించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ జిల్లా : గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మంత్రి నల్లగొండలో ప్రచారం చేపట్టారు. ఊహించని రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీంతో సంతోషానికి లోనైన కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఊపిరి ఉన్నంత వరకు నల్లగొండ అభివృద్ది కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోనే నల్లగొండ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇప్పటికే పట్టణ అభివృద్ది కోసం వందల కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి . 48కి 48 డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే నల్లగొండ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు మంత్రి. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.






