కుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్రశంసలు
న్యూఢిల్లీ : హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచారు. ఈ సందర్బంగా మన కుర్రాళ్లపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. అద్భుతం చేశారంటూ ప్రశంసలు కురిపించారు. మీరు సాధించిన విజయం కలకాలం గుర్తుండి పోతుందన్నారు.
ప్రత్యేకించి ప్రధానమంత్రి వైభవ్ సూర్య వంశీని అభినందించాడు. మీ గెలుపు ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత జట్టు వరుసగా ఆరోసారి వరల్డ్ కప్ ను గెలుచు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తి కొనసాగాలని కోరారు.
తను చేసిన పోస్టులో భారత క్రికెట్ ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై మెరిసిందని పేర్కొన్నారు. అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ కు తీసుకు వచ్చినందుకు ఆయన జట్టుకు కంగ్రాట్స్ తెలిపారు. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడారంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఏకంగా 412 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ కెరటం వైభవ్ సూర్య వంశీ ఏకంగా 175 రన్స్ చేశాడు. తను కేవలం 85 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.








