ఎండ‌ల మ‌ల్లికార్జున స్వామి బ్రోచ‌ర్ విడుద‌ల

Spread the love

భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేయాల‌ని అచ్చెన్న ఆదేశం
అమ‌రావ‌తి : మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా నిర్వ‌హించే ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, ప‌శు సంవ‌ర్ద‌క శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. పవిత్రమైన శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తాగునీరు, రవాణా, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా వంటి కనీస వసతుల్లో ఎక్కడా లోటు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతకు పెద్దపీట వేయాలని తెలిపారు. ఆలయ కమిటీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు కింజార‌పు అచ్చెన్నాయుడు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు.

  • Related Posts

    మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.…

    అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావ‌ణి శ్రీ‌

    Spread the love

    Spread the loveశ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంత‌పురం జిల్లా : ప్ర‌తి ఏటా నిర్వ‌హించే అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *