ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తార‌ల భేటీ

Spread the love

ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్స‌వం

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది మ‌రాఠా లోని ముంబై న‌గ‌రంలో. దేశానికి చెందిన వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు , సినీ తార‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను క‌లిసేందుకు బారులు తీరారు. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేందుకు పోటీ ప‌డ్డారు. ఇందులో సినీ న‌టులు ఉన్నారు. రూపా గంగోలీతో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి కూడా మోహ‌న్ భ‌గ‌వ‌త్ తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రు న‌టులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత దేశాన్ని ప్ర‌భావితం చేస్తున్న వ్య‌క్తుల‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఒక‌రు అని పేర్కొన్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో త‌న‌తో భేటీ కావ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రూపా గంగూలీ, శిల్పా శెట్టి. ఆర్ఎస్ఎస్ వంద‌వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌లో భాగం కావ‌డం తాము జీవితంలో మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఈ చారిత్రాత్మ‌క సంద‌ర్బంలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    హ్యాపీ బ‌ర్త్ డే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

    Spread the love

    Spread the loveబుచ్చిబాబు స‌న మూవీ పెద్ది గ్లింప్స్ రిలీజ్ హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు , న‌టుడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఇవాళ‌. మార్చి 27వ తదీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య…

    మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

    Spread the love

    Spread the loveనియ‌మించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైద‌రాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *