చెన్నై వెడ్డింగ్ లో కలుసుకున్న నేతలు
చెన్నై : చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి విజయ్. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని చాలా సేపు సంభాషించారు. దీంతో ఈ పెళ్లి కార్యక్రమం వీరిద్దరి చుట్టే తిరిగింది. చెన్నైలో జరిగిన జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో జన నాయకుడితో జన నాయగన్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాని సినీ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దీనిని స్వయంగా దగ్గరుండి నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ తో పాటు స్టార్ హీరోలు కార్తీ, సూర్య లు పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.






