జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాను అభివృద్ది చేస్తాం

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం అని అన్నారు. కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉందన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని ప్ర‌క‌టించారు సీఎం. సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయని తెలిపారు. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప‌ని చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారని అన్నారు. 2027లో నిర్వహించబోయే పుష్కరాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతాం అన్నారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు.

  • Related Posts

    ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

    Spread the love

    Spread the loveఅమిత్ షా, నిర్మాలా సీతారామన్ ల‌తో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.…

    పోలీసుల‌పై గాద‌రి కిషోర్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని కేసుల‌పై ఫైర్ న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల ప‌నితీరు దారుణంగా ఉంద‌న్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు ప‌నిగ‌ట్టుకుని త‌మ‌ను ల‌క్ష్యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *