Saturday, 17 October 2026

ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

newsseals-APCMTour

అమిత్ షా, నిర్మాలా సీతారామన్ ల‌తో భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌లతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని కోర‌నున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *