పోలీసుల‌పై గాద‌రి కిషోర్ షాకింగ్ కామెంట్స్

త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని కేసుల‌పై ఫైర్

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల ప‌నితీరు దారుణంగా ఉంద‌న్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాద‌రి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు ప‌నిగ‌ట్టుకుని త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం, ఆపై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు. త‌మ పార్టీకి చెందిన అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు మాజీ ఎమ్మెల్యే. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గాద‌రి కిషోర్.

నా పేరు చెప్తే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చప్పుడు చేయడని అన్నారు, మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడడు అని ఎద్దేవా చేశారు. మీ ఎమ్మెల్యేకి సోయి లేదంటూ ఎద్దేవా చేశారు గాద‌రి కిషోర్.
త‌ను నిరంత‌రం తాగి ప‌డుకోవ‌డం త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు. పోలీసులు ఉత్సాహం ప్రదర్శిస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ ఫైర్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేద‌న్నారు. రేవంత్ రెడ్డి తాను రాజున‌ని ఫీల్ అవుతున్నాడ‌ని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. 14 ఏళ్ల పాటు కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌స్తే , 10 ఏళ్ల పాటు అభివృద్ది చేస్తే సీఎం వ‌చ్చాక అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *