తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకి బ‌డ్జెట్ ఉప‌యోగ ప‌డాలి

VijayaBhaskar · February 10, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌
తిరుప‌తి : మ‌నం ప్ర‌తిపాదించి, ఆమోదించిన బ‌డ్జెట్ తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర ప్రజలకు తాము చెల్లిస్తున్న ప్రతి రూపాయిని తాము ఎన్నుకున్న ప్రతినిధులు చాలా జాగ్రత్తగా , బాధ్యతగా ఖర్చు పెడుతున్నారనే న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని స్ప‌ష్టం చేశారు. మా గురించే.. మా ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని భావించాలని అన్నారు. ఎందుకంటే మనం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజల పన్నుల ద్వారానే అన్న విషయం మరిచి పోకూడదన్నారు. అందుకే బడ్జెట్ చర్చలో పాల్గొనే నాతో సహా ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా ఉండాల‌ని పేర్కొన్నారు.

తిరుపతి నగర ప్రజల సాధారణ రోజువారీ అవసరాలు తీరాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమ‌ని, భవిష్యత్తు నగర అభివృద్ధి అవసరమైన మౌలిక వసతుల కోసం మన ఆలోచనలు ఉండాలన్నారు. గత బడ్జట్ ప్రతిపాదనలు , ఖర్చు చేసిన విధానం పై హేతుబద్ధమైన చర్చ చేయాల‌ని సూచించారు. బడ్జెట్ లో కీలకమైన అంశం ఆదాయం.. ఆదాయ వ్యయాలపై ప్రతి సభ్యులు స్పష్టంగా మాట్లాడాలి. ఏ నగరానికి లేని అవకాశం మన తిరుపతి నగరానికి ఉన్నదని చెప్పారు.. శ్రీవారి పాదాల చెంత నెలకొన్న నగరం కాబట్టి టిటిడి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి విలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని కోరారు.