యూట‌ర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Spread the love

ఫిబ్ర‌వ‌రి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ

హైద‌రాబాద్ : క్రికెట్ అభిమానుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్ర‌క‌టించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ప్ర‌దాని షెహ‌బాజ్ ష‌రీఫ్ సైతం అనుమ‌తి ఇచ్చేది లేదంటూ ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో అస‌లు మ్యాచ్ లు జ‌రుగుతాయా లేదా అన్న అనుమానం నెల‌కొంది. మ‌రో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియాతో ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించింది. ఇండియాలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే ఛాన్స్ ఉందంటూ ఆరోపించింది. దీంతో ఐసీసీ సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ బోర్డుల‌కు భ‌విష్య‌త్తులో ఆడేందుకు ఛాన్స్ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఐసీసీ నుంచి తీవ్ర ఒత్తిడి రావ‌డంతో పాటు స్పాన్స‌ర్ చేస్తున్న కంపెనీలు సైతం సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చాయి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు. చివ‌ర‌కు ఒత్తిడిని త‌ట్టుకోలేక పాకిస్తాన్ పీఎం ష‌రీఫ్ దిగి వ‌చ్చారు. ఒకానొక ద‌శ‌లో అమెరికా సైతం జోక్యం చేసుకున్న‌ట్లు పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు పీసీబీ చీఫ్ మోహిషిన్ న‌ఖ్వీ. తాము భార‌త్ తో ఆడేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక దేశ రాజ‌ధాని కొలంబో వేదిక‌గా దాయాదులైన పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

  • Related Posts

    సంజూ శాంస‌న్ కు బీసీసీఐ బిగ్ షాక్

    Spread the love

    Spread the loveకాంట్రాక్టు కింద సి కేట‌గిరి లోకి మార్పు ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్ర‌తి ఏటా బీసీసీఐ ఆయా…

    విశ్వ విజేత‌ల‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు

    Spread the love

    Spread the loveకుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్ర‌శంస‌లు న్యూఢిల్లీ : హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ ను 100 ప‌రుగుల తేడాతో ఓడించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *