న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం

న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం లేదు. త‌ను గ‌త కొన్ని రోజులుగా తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ ప‌డుతున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎవ‌రిని ఓపెన‌ర్ గా తీసుకోవాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన కేర‌ళ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తీవ్ర నిరాశ ప‌రిచాడు. త‌ను కేవ‌లం 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దీంతో అనూహ్యంగా తెర‌పైకి ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు. త‌ను ప్ర‌స్తుతం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు.

ఈ త‌రుణంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని గంభీర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక స‌కాలంలో కోలుకుంటే అభిషేక్ శ‌ర్మ‌ను ఆడిస్తామ‌ని లేక పోతే సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు సూత్ర ప్రాయంగా వెల్ల‌డించాడు బ్యాటింగ్ కోచ్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ మైదానంలో సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ తో క‌లిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నమీబియాతో జరిగే మ్యాచ్ కు ముందు అభిషేక్ శ‌ర్మ‌కు జ్వరం లక్షణాలు తగ్గకపోతే, పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అతను పూర్తిగా ఫిట్ గా ఉండేలా టీం ఇండియా త‌న‌ స్థానంలో సంజు సామ్సన్ ను తీసుకోవచ్చు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *