అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ కంగ్రాట్స్

Spread the love

భార‌త్ తో ఓడి పోయినా బాగా ఆడార‌ని కితాబు

అమెరికా : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. త‌న స్వంత సామాజిక మాధ్య‌మం ట్రూత్ సోష‌ల్ వేదిక‌గా ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా తొలి మ్యాచ్ లో అమెరికా దేశానికి చెందిన యుఎస్ క్రికెట్ టీం బ‌ల‌మైన భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. ఒక ర‌కంగా ఓడించినంత ప‌ని చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆదిలోనే వికెట్ల‌ను పారేసుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 161 ర‌న్స్ చేసింది. అనంత‌రం 24 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది అమెరికా. ఈ సంద‌ర్బంగా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్.

మీరు చేసిన ప్ర‌ద‌ర్శ‌న స్పూర్తి దాయ‌కంగా ఉంద‌ని , ఇదే జోరును ఇక ముందు కూడా జ‌రిగే మ్యాచ్ ల‌లో ప్ర‌ద‌ర్శించాల‌ని కోరారు . సామాజిక వేదిక‌గా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. అమెరికా జ‌ట్టుతో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొంటున్న ప్ర‌తి జ‌ట్టుకు ఆయ‌న శుభాశీస్సులు అందజేశారు. భారతదేశంలో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోందని నేను ఇప్పుడే విన్నాను! అమెరికా క్రికెట్ జ‌ట్టుకు శుభాకాంక్షలు. మాకు చాలా బలమైన జట్టు ఉందని , అమెరికా మీ కోసం ఎదురు చూస్తోందంటూ పేర్కొన్నారు.

  • Related Posts

    న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

    Spread the love

    Spread the loveక‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్…

    ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *