దేశానికే ఆద‌ర్శ ప్రాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

VijayaBhaskar · February 13, 2026
Spread the love

ప్ర‌క‌టించిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ స‌మావేశంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీని స‌ర్వ నాశ‌నం చేశార‌న్నారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ కు కేంద్రం అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద ఉన్న రాష్ట్రం కొద్ది కొద్దిగా కోలుకుంటోంద‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. త‌ల్లికి వంద‌నం, మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం , త‌దిత‌ర స్కీంలు ఆద‌ర్శంగా మారాయ‌న్నారు సీఎం.

దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తు్న్నామ‌ని చెప్పారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నామ‌న్నారు. అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తు్న్నామన్నారు. పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఈ విధానంలోనే నిర్మిస్తు్న్నారని తెలిపారు సీఎం. పీపీపీలోనే వీజీఎఫ్ ద్వారా ప్రాజెక్టు నిర్మించి నిర్వహిస్తారన్నారు. నిర్దిష్ట కాలపరిమితి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారని ప్ర‌క‌టించారు.