మహనీయుడు సంత్ సేవాలాల్ మ‌హారాజ్

Spread the love

నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా నిర్మిస్తామని అన్నారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. మానవజాతి శాంతి మార్గంలో, చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. అలాంటి మహనీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిద‌ని అన్నారు. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డారని ప్ర‌శంస‌లు కురిపించారు.ప్రతి తండాలో పాఠశాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. తాగడానికి మంచినీరు, కరెంట్ అందించాలి. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *