2వ స్థానంలో బెంగళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీ
హైదరాబాద్ : మహారాష్ట్రలోని బృహన్న ముంబై కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గణనీయమైన ఆదాయన్ని గడించింది. ఈ సందర్బంగా అత్యధిక ఆదాయం కలిగిన కార్పొరేషన్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబర్ వన్ గా నిలిచింది. మౌలిక వసతులు, అభివృద్ధి పనుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముంబై కార్పొరేషన్ రూ. 74,427 కోట్లతో ప్రథమ స్థానంలో నిలవగా , 2వ స్థానంలో బెంగళూరు కార్పొరేషన్ నిలిచింది. ఈ సంస్థ రూ. 19,930 కోట్ల ఆదాయాన్ని గడించింది. మూడవ స్థానంలో దేశ రాజధాని న్యూఢిల్లీ కార్పొరేషన్ నిలిచింది. ఈ సంస్థ రూ. 16,530 కోట్లతో ఆదాయన్ని గడించింది.
ఇక కార్పొరేషన్ల జాబితాలో రూ. 15,502 కోట్లతో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కార్పొరేషన్ నిలవగా , 5వ స్థానంలో రూ. 12, 618 కోట్లతో పూణే కార్పొరేషన్ , 6వ స్థానంలో రూ. 11, 460 కోట్లతో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిలిచింది. ఇక 7వ ప్లేస్ లో రూ. 8,400 కోట్లతో చెన్నై కార్పొరేషన్ నిలవగా , తర్వాతి స్థానాలలో కోల్ కతా కార్పొరేషన్ రూ. 5,166 కోట్లతో, విశాఖపట్నం కార్పొరేషన్ రూ. 4, 672 కోట్లతో 10వ స్థానంలో నిలిచింది.






