బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ క‌మ్

Spread the love

ఏపీకి విచ్చేసిన టెక్నాల‌జీ దిగ్గ‌జం

అమ‌రావ‌తి : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం, గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ సోమ‌వారం ఏపీలో కాలు మోపారు. ఆయ‌న‌కు గంగ‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. భారీ భ‌ద్ర‌త న‌డుమ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి సచివాల‌యానికి చేరుకున్నారు బిల్ గేట్స్. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో బిల్ గేట్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతించారు.

నాయుడు మంత్రులను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ‌ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్ ను స‌హ‌చ‌ర మంత్రులు హోం శాఖ మంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ లతో కలిసి ఆహ్వానం ప‌ల‌క‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత ఆధారిత పాలనలో భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై చర్చించనున్న‌ట్లు వెల్ల‌డించారు. గేట్స్ ఫౌండేష‌న్ తో క‌లిసి ప‌ని చేసేందుకు ఏపీ రాష్ట్రం సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

  • Related Posts

    ఏఐ టెక్నాల‌జీతో విద్యా రంగంలో కీల‌క మార్పులు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టించిన టెక్నాల‌జీ దిగ్గ‌జం, బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి…

    రూ. 10.86 కోట్ల‌తో తేనెటీగ‌ల అభివృద్ది ప్రాజెక్టులు

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *