పీసీబీ చైర్మ‌న్ న‌ఖ్వీపై షోయ‌బ్ అఖ్త‌ర్ ఫైర్

Spread the love

త‌ను ఆ ప‌ద‌వికి త‌గిన వ్య‌క్తి కాద‌ని ఆగ్ర‌హం

పాకిస్తాన్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి భార‌త జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి స‌ద‌రు జ‌ట్టుపై. భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 175 ర‌న్స్ చేసింది. ఓ వైపు త్వ‌ర‌గానే ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అవుట్ అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు ఇషాన్ కిష‌న్ . త‌ను 77 ర‌న్స్ చేశాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 114 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. భార‌త బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు. వికెట్ల‌ను పారేసుకున్నారు.

దీంతో త‌మ పాకిస్తాన్ జ‌ట్టు ఓట‌మి పాల‌వ‌డంపై సీరియ‌స్ గా స్పందించాడు మాజీ పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షోయ‌బ్ అఖ్త‌ర్. త‌ను నిప్పులు చెరిగారు ప్ర‌స్తుత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ గా ఉన్న మోహిసిన్ న‌ఖ్వీపై. పాక్ సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజామ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెత్త ప్రదర్శనలు చేస్తున్నార‌ని, అయినా వారిని ఎందుకు జ‌ట్టులో ఎందుకు కొన‌సాగిస్తున్నారంటూ ప్ర‌శ్నించాడు. న‌ఖ్వీని నిల‌దీశాడు అఖ్త‌ర్. అస‌లు న‌ఖ్వీకి సోయి ఏమైనా ఉందా అంటూ మండిప‌డ్డారు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ అన్న విషయమైనా గుర్తుందా? ఏమీ తెలియని వ్యక్తిని పీసీబీ చైర్మన్ చేశారు. ఇలాఉంటే జట్టెలా ముందుకు నడుస్తుందని భ‌గ్గుమ‌న్నారు. మీరు ఒక వ్యక్తిని సూపర్ స్టార్ అన్నారు. కానీ అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించ లేద‌ని ఫైర్ అయ్యాడు షోయ‌బ్ అఖ్త‌ర్.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *