రూ. 10.86 కోట్ల‌తో తేనెటీగ‌ల అభివృద్ది ప్రాజెక్టులు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలో
నూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్, వాల్యుయేషన్ ఆఫ్ బనానా సూడో స్టెమ్ మొదలైన కార్యక్రమాలు చేస్తున్నామ‌న్నారు. 2026-27లో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్ రూ.97.99 కోట్లు ప్రతిపాదించామ‌న్నారు . ఇక శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయంలో దేశంలోనే మొట్ట మొదటిగా పశు సంవర్థక డిప్లొమా కోర్సును ఈ విశ్వ విద్యాలయంలో ప్రారంభించామ‌న్నారు అచ్చెన్నాయుడు.

రేబిస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధన శాలను విశ్వ విద్యాలయానికి కేటాయించామ‌న్నారు. ఈ విశ్వ విద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయిలు వివిధ విభాగాల అభివృద్దికి కేటాయించామ‌న్నారు. సుమారు 208 లక్షల ఒంగోలు జాతి, 132 లక్ష పుంగనూరు జాతి వీర్యనాళికలు, 900 వనరాజా కోళ్ళను రైతులకు అందజేశామ‌న్నారు. స్వజాతి పశువులు అంతరించి పోకుండా, వాటి ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే విధంగా తయారు చేయడానికి పశు వైద్య విశ్వ విద్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానముతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. 2026-27లో శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం కోసం బడ్జెట్ రూ.163.01 కోట్లు ప్రతిపాదించిన‌ట్లు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *